BREAKING
సామాజిక సేవలతోనే గుర్తింపు..-ఎస్సై తోట తిరుపతి సీఎస్‌పురం జడ్పీటీసీగా కోటపాటి నామినేషన్ మల్లా పూర్, నాచారం లోని వి ఎన్ ఆర్ గార్డెన్ లో దేశ రక్షణ ధర్మ రక్షణ యాగం కు అంకురార్పణ మూడు రోజుల్లో 66 నామినేషన్లు అమెరికా నుంచి సియెర్రాలియోన్‌కు వలసదారుల బహిష్కరణ సుడాన్ అంతర్యుద్ధంపై డ్రోన్ దాడి కలకలం ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఘట్టం చదువుతోనే ఉన్నత స్థానం.. -ఎస్సై తోట తిరుపతి -పోలీసు విధులు,చట్టాలపై విద్యార్థులకు అవగాహన.. అమెరికాలో హలోవీన్ వేడుకలు...భయానక ఉత్సాహంతో ప్రత్యేక ఏర్పాట్లు కళ్యాణదుర్గం ఎంపిడివో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. నార్పల జనసేన ZPTC అభ్యర్థిగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ.. చెవులూ అమెరికాలో మీజిల్స్ వ్యాధి...భారీగా పెరిగిన కేసులు, సీడీసీ హెచ్చరిక సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ మండల నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు

అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోంది: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Select Suryaa Now
అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోంది: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

 నెల్లూరు,  మేజర్ న్యూస్ :   కూటమి ప్రభుత్వం నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నగరంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి , కూటమి నాయకులతో కలిసి శుక్రవారం 30వ డివిజన్‌లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌తో పాటు జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిషికేశ్‌ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

రూ.1,000 కోట్లతో నగరంలో అభివృద్ధి..
నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో సుమారు రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇంకా దాదాపు రూ.1,200 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. నగరంలోని మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

రూప్ కుమార్ యాదవ్‌ను మేయర్‌గా గెలిపించండి
ప్రజా సేవ, రాజకీయాల్లో మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌కు ఎంతో అనుభవం ఉందని ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి  పేర్కొన్నారు. 2005 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయనకు ప్రజా సమస్యలపై అవగాహనతో పాటు వాటిని పరిష్కరించే సామర్థ్యం ఉందన్నారు. నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని, ఓటర్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి రూప్ కుమార్ యాదవ్‌ను మేయర్‌గా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.

యువ నాయకుడు రిషికి అండగా నిలవండి
30వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న రిషికేశ్‌ యాదవ్‌ యువకుడని, కష్టపడి పనిచేసే సామర్థ్యం ఉన్న నాయకుడని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయగల నాయకుడిగా రిషి యాదవ్ ఎదుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లాస్ గుర్తుపై ఓటు వేసి రిషి యాదవ్‌ను కార్పొరేటర్‌గా గెలిపించాలని, ప్రజలందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని కోరారు.

మంత్రి నారాయణ చొరవతో నెల్లూరుకు నిధుల వరద..
నెల్లూరు నగరం అంటే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ప్రత్యేకమైన ప్రేమ, అనుబంధం ఉన్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. నెల్లూరులో పార్కులు, రహదారులు, పాఠశాలలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మంత్రి నారాయణ ప్రత్యేక చొరవ తీసుకుంటూ పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ ఉండటం వల్లే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు..
విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  అన్నారు. మంత్రి నారాయణ చొరవతో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.