BREAKING
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత్ కంది కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ మల్లంపేట నుంచి ఇండిపెండెంట్ కౌన్సిలర్ లు గా భార్య భర్తలు గెలుపు నవ్వుల పూలు పూయిస్తున్న ఈఎన్‌ఈ రిపీట్ ట్రైలర్.. థియేటర్లలో నూతన అల్లరితో రానున్న విశ్వక్ సేన్ గ్యాంగ్! దేశంలో ఐదు రెట్లు పెరగనున్న డేటా సెంటర్ సామర్థ్యం పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు ఈ అద్భుత విజయం మీదే.. ఎప్పటికీ మీ శిష్యులమే! జాతీయవాదుల సంగమం కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు 2029 నాటికి రూ. 3 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తి ప్రత్తిపాడు: మెరుసు తుఫాను ప్రభావం..విద్యుత్ సిబ్బంది అష్ట కష్టాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ బి. సత్య ప్రసాద్ డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం! ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సాధారణ పరిశీలకులతో చర్చించిన సబ్ కలెక్టర్ మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.

ఆత్మకూరు మున్సిపాలిటీలో కూటమికి 17 వార్డులు -వైసీపీ కూటమికి 11 వార్డులు

Select Suryaa Now
ఆత్మకూరు మున్సిపాలిటీలో కూటమికి 17 వార్డులు -వైసీపీ కూటమికి 11 వార్డులు

 
ఆత్మకూరు, మేజర్ న్యూస్:
ఆత్మకూరు మున్సిపాలిటీ జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం చైర్ పర్సన్ గా కూటమి ఆధ్వర్యంలో పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 2026 ఓట్లతో ఘన విజయం సాధించారు. 28 వార్డులకు గాను పదో వార్డు తెలుగుదేశం అభ్యర్థి కృష్ణవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 27 వార్థులకు ఎన్నికలు జరుగగా మంగళవారం ఓట్ల లెక్కింపు జరగగా 11 స్థానాలు తెలుగుదేశంకు, మూడు స్థానాలు జనసేనకు, ఒక స్థానం జనసేన కు సంబంధించిన స్వతంత్ర అభ్యర్థికి, ఒక స్థానం బీజేపీ అభ్యర్థికి లభించాయి. పది స్థానాలు వైసిపి అభ్యర్థులకు ఒక స్థానం వారికి మద్దతుగా నిలిచిన సిపిఎం అభ్యర్థికి దక్కాయి. మున్సిపాలిటీలో తెలుగుదేశం బిజెపి జనసేన ఇండిపెండెంట్ ల కూటమి కి 17 స్థానాలు లభించగా, వైసీపీ, సీపీఎంలకు 11 స్థానాలు లభించాయి. 27 మంది అభ్యర్థులు విజయం సాధించినట్లుగా అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. తెలుగుదేశం వార్డులు పరిశీలిస్తే పదో వార్డు నుండి ఏ.కృష్ణవేణి ఏకగ్రీవంగా ఎన్నికకాగా ఓట్ల లెక్కింపు అనంతరం నాలుగో వార్డ్ నుండి తెలుగుదేశం అభ్యర్థి షేక్ షాహిన్ 153 ఓట్ల మెజారిటీతో  సిపిఎం కి చెందిన షేక్  ముజిబున్నీసాపై విజయం సాధించారు. ఐదో వార్డులో తెలుగుదేశం అభ్యర్థి షేక్ నాయబ్ రసూల్ (చిన్న )153 ఓట్లమెజారిటీ తో వైసీపీ అభ్యర్థి వి వెంకటేశ్వర్లు పై విజయం సాధించారు. ఏడో వార్డులో తెలుగుదేశం అభ్యర్థి పొన్నూరు హరికృష్ణ 207 ఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్థి నోటి వినయ్ కుమార్ రెడ్డి పై విజయం సాధించారు.ఎనిమిదో వార్డులో తెలుగుదేశం అభ్యర్థి సయ్యద్ మొబీన 96 ఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్థి షేక్ షకీరా పై విజయం సాధించారు. 13వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి తోడేటి మాధవి లత 171 ఓట్ల మెజారిటీతో వైసీపీకి చెందిన షేక్ ప్రవీణ్ పై విజయం సాధించారు. 14 వార్డులో తెలుగుదేశం అభ్యర్థి పచ్చిపాల హరిత 42 ఓట్ల మెజారిటీతో వైసీపీకి చెందిన తెల్లజాల పద్మమ్మ పై విజయం సాధించారు. 15వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి షేక్ మొహిబుల్లా 81 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి ఎండి ముజీబుల్లా పై విజయం సాధించారు. 16వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి షేక్ కైరున్నీసా 255 ఓట్ల మెజారిటీతో వైసీపీకి చెందిన షేక్ బిబిజాన్ పై విజయం సాధించారు. 24 వ వార్డులో పట్టణ తెలుగుదేశంఅధ్యక్షులు  తుమ్మల చంద్ర రెడ్డి 405 ఓట్ల మెజారిటీతో సిపిఐ కి చెందిన అంకమ్మ పై విజయం సాధించారు. 27వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి చెరుకూరు పద్మావతమ్మ వైసీపీకి చెందిన చెరుకూరు సుప్రజా పై 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 28వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి తోగుంట స్వప్న 254 ఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్థి పై విజయం సాధించారు. ఒకటో వార్డులో జనసేన అభ్యర్థి కొమరగిరి శాంతకుమారు 88 ఓట్ల మెజారిటీతో  వైసీపీకి ఎకుల చిన్నయ్య పై విజయం సాధించారు. ఆరో వార్డులో జనసేన అభ్యర్థి కత్తి పద్మజ 120 ఓట్ల మెజారిటీతో వైసీపీకి చెందిన షేక్ ఖాజా మస్తాన్ పై విజయం సాధించారు. 11వ వార్డులో జనసేన అభ్యర్థి కొలగాని శిరీష 106 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం కి చెందిన కొలగాని ప్రశాంతి పై విజయం సాధించారు. జనసేనకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి గడ్డం సంధ్య 39 ఓట్ల మెజారిటీతో టిడిపికి చెందిన గడ్డం అమరావతి పై విజయం సాధించారు.రెండో వార్డ్ నుండి వైసీపీ అభ్యర్థి అండ్రసుబ్బారెడ్డి 223 ఓట్ల మెజారిటీతో   టిడిపి అభ్యర్థి దగ్గు మాటి శివ కోటారెడ్డి పై విజయం సాధించారు. 9వ వార్డులో వైసీపీ అభ్యర్థి నాగులపాటి స్వప్న 192 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి పుచ్చలపల్లి రాధిక పై విజయం సాధించారు. 17వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఎం డి దిల్షాద్ 21 ఓట్లతో తెలుగుదేశం కి చెందిన షేక్ ఖాదర్ బాషా పై విజయం సాధించారు. 18 వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఎన్.ఆదిలక్ష్మి 193 ఓట్ల మెజారిటీతో టిడిపికి చెందిన చల్ల కవితపై విజయం సాధించారు. 19వ వార్డులో వైసీపీ అభ్యర్థి పఠాన్ సర్దార్ఖాన్ 157 ఓట్లు మెజారిటీతో టిడిపికి చెందిన షేక్ సర్దార్ పై విజయం సాధించారు. 20వ వార్డులో వైసీపీ అభ్యర్థి మల్లెంకొండయ్య 5 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి గంధళ్ల వేణు పై విజయం సాధించారు. 22వ వార్డులో వైసీపీ అభ్యర్థి కావాటి సుగుణమ్మ 122 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి గురునాథం జయమ్మ పై విజయం సాధించారు. 23వ వార్డులో వైసీపీ అభ్యర్థి నందవరం ప్రసాదు 150 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి సందిపోగు సుమన్ పై విజయం సాధించారు. 25 వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఎల్లంటి కల్పన 97 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి దక్కా రమణమ్మ పై విజయం సాధించారు. 26 వార్డులో వైసీపీ అభ్యర్థి మాదాల కృపాకర్ నాయుడు 18 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి మాదాల శ్రీనివాస నాయుడు పై విజయం సాధించారు.