ఆలూరు ఎర్రిస్వామి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో ( అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆలూరు ఎర్రిస్వామి రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా పలకరించుకుని, పలు రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు.
మేయర్ అభ్యర్థిగా రమేష్ గౌడ్‌ను పార్టీ అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో, నగరంలో పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విజయ సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. సీనియర్ నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు, సహకారం తీసుకోవడం ద్వారా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు రమేష్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు.
రిపోర్టర్ మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.