|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 02:10 PM
పాలకుర్తి నియోజకవర్గంలో యశస్విని రెడ్డికి షాక్. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కటైన సీనియర్ కాంగ్రెస్ నేతలు. తొర్రూరులో భేటీ అయిన అసమ్మతి నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలిపే అంశంపై తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఝాన్సీ రెడ్డి అధ్యక్షతన ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రావని.. ఆమె కారణంగా అసలైన కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని ఆగ్రహం. ఝాన్సీ రెడ్డి పై మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డిలను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు. రెండు రోజుల్లో గాంధీ భవన్ కు వెళ్ళాలని ఏకగ్రీవ తీర్మానం