|
|
by Suryaa Desk | Sun, Jul 27, 2025, 07:50 PM
బీఎర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మధ్య మాటల యద్ధం తెలంగాణలో రాజకీయ వేడిని రగిల్చింది. కేటీఆర్, సీఎం రమేశ్ ల పరస్పర ఆరోపణల వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా జోక్యం చేసుకుంటున్నారు. తాజాగా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. కేటీఆర్ ఎలాంటి వాడన్నది రాష్ట్ర ప్రజలు గమనించాలని అన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు సీఎం రమేశ్ ఇంటికి వెళ్లారా, లేదా దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. "కవితపై ఉన్న కేసులు ఎత్తివేస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని చెప్పారా, లేదా బీఆర్ఎస్ ఓ అవినీతి పార్టీ అని, ఆ పార్టీని కలుపుకునేది లేదని బీజేపీ హైకమాండ్ చెప్పింది నిజం కాదా పలు సామాజిక వర్గాలపై మీరు తీవ్ర వ్యాఖ్యలు చేయలేదా ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించకుండా దమ్ముంటే సీఎం రమేశ్ అడిగిన వాటికి కేటీఆర్ సమాధానం చెప్పాలి" అని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.