![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 02:54 PM
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, "రేవంత్‌రెడ్డికి ఇరిగేషన్ అంశంపై కనీస అవగాహన కూడా లేదు. ఆయనకు తెలిసినవి రియల్ ఎస్టేట్, బ్లాక్‌మెయిల్ దందాలు మాత్రమే" అని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై స్పందించిన కేటీఆర్, "ఈ అంశంపై ఏ స్థాయిలో అయినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం" అని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన సమావేశం గురించి మాట్లాడుతూ, "ఆ మీటింగ్ పెట్టించిన వ్యక్తి చంద్రబాబే. కమిటీని కూడా ఆయనే నియమించారు" అని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాలతో నీటి విషయంలో అవగాహన, చర్చలు జరిపి వాటాలు తేల్చిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం ఓ ప్రాంత ప్రయోజనం కోసం కాదు, రాయలసీమకు కూడా లాభం కలిగే విధంగా ప్రాజెక్టులు ఉండాలని కే.సీ.ఆర్ ఆకాంక్షించారని తెలిపారు.