|
|
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 06:57 PM
తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు నేడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది.ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బనకచర్ల(Banakacharla) కడతామనే చర్చ రానపుడు, ఆపమనే చర్చనే రాదన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వ సంస్థలే బనకచర్లకు అభ్యంతరం తెలిపాయని గుర్తించారు. ఈ భేటీలో ముఖ్యంగా 4 అంశాలు చర్చించామని తెలిపారు. కృష్ణా నీటి వాడకానికి టెలిమెట్రీ ఏర్పాటు చేయడానికి ఏపీ ఒప్పుకుంది. శ్రీశైలం ప్రాజెక్టులో ఏర్పడిన డ్యామేజీని సవరించడానికి చర్యలు చేపడతాం.ఏపీలో కృష్ణా బోర్డు, తెలంగాణ గోదావరి బోర్డు ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు సుముఖం అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలపై ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని, వివాదాలను పరిష్కరించుకుంటామని తెలియజేశారు. ఇది అపెక్స్ మీటింగ్ కాదని, సాధారణ సమావేశం అన్నారు. కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి గంప గుత్తగా ఇచ్చారని, వాటి వల్ల ఏర్పడిన వివాదాలనే ఇప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తాయని, కానీ వాటిని మేము పట్టించుకోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.