BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

*శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజాప్రతినిధుల చిత్రపటాల దహనం: 6 గురిపై కేసు నమోదు*

Select Suryaa Now
*శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజాప్రతినిధుల చిత్రపటాల దహనం: 6 గురిపై కేసు నమోదు*

కోహెడ;కోహెడ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ధర్మసాగర్‌పల్లి గ్రామంలో అక్రమంగా గుమికూడి, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన కొందరు వ్యక్తులపై చట్టరీత్యా కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు.  సంఘటన వివరాలు ధర్మసాగర్‌పల్లి గ్రామ సర్పంచ్ కరివేద చంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తేదీ 20.10.2026 రాత్రి దసరా పండుగ వేడుకల సందర్భంగా ధర్మసాగర్‌పల్లి గ్రామంలోని హనుమాన్ గుడి వద్ద ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా కొందరు యువకులు అక్రమంగా గుమికూడారు. గ్రామంలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మరియు పల్లె వాతావరణంలో అశాంతిని సృష్టించే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర బిసి సంక్షేమ, రవాణా శాఖామాత్యులు, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని రావణాసురుని రూపంలో తయారు చేయించారు. సదరు ఫ్లెక్సీని కోహెడలోని 'మణికంఠ ప్లెక్సీ ప్రింటర్' షాపు నిర్వాహకుడు ఎండీ. ఆరిఫ్ సాయంతో తయారు చేయించి, దాన్ని కట్టెలకు కట్టి, గడ్డి పెట్టి నిప్పు అంటించి దహనం చేశారు. అంతేకాకుండా, ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి, ప్రజల మధ్య పగలు పెంచే విధంగా, గొడవలు సృష్టించేలా ప్రచారం చేశారు. కేసు నమోదు మరియు దర్యాప్తు.ఈ సంఘటనకు పాల్పడిన క్రింది నిందితులపై మరియు వారికి సహకరించిన వారిపై కోహెడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది అని హుస్నాబాద్ ఏసిపి సదానందం తెలియజేశారు. నిందితుల వివరాలు పోతరవేణి రాకేష్, తండ్రి మొండయ్య, లోనే హరీష్, తండ్రి మల్లేషం, మొతుకురు శ్రీకాంత్, తండ్రి కొమురయ్య,గొండ అజయ్ కుమార్ అభి, తండ్రి సంజీవ్, బండ అభిషేక్, తండ్రి మల్లేష్ (అందరూ ధర్మసాగర్‌పల్లి నివాసితులు) ఎండీ. ఆరిఫ్ (మణికంఠ ప్లెక్సీ ప్రింటర్స్, కోహెడ)  చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, రాజకీయ ఉద్రిక్తతలు లేదా వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా, అశాంతికి గురిచేసినా సహించేది లేదని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ సదానందం హెచ్చరించారు.