BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

రోడ్డుకు మార్గదర్శకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు వడ్డేపల్లి రాజేశ్వరరావు సహకారంతో శక్తి నగర్‌లో మట్టి రోడ్డు నిర్మాణం

Select Suryaa Now
రోడ్డుకు మార్గదర్శకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు  వడ్డేపల్లి రాజేశ్వరరావు సహకారంతో శక్తి నగర్‌లో మట్టి రోడ్డు నిర్మాణం


                                               15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న రహదారికి తాత్కాలిక పరిష్కారం.

కూకట్ పల్లి, మేజర్ న్యూస్:ఖైతలాపూర్ డివిజన్ పరిధిలోని శక్తి నగర్‌లో వైట్ వాటర్ అపార్ట్‌మెంట్స్ వద్ద గత 15 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న రహదారి సమస్యకు ఎట్టకేలకు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు చొరవతో తాత్కాలిక పరిష్కారం లభించింది.గత వారం రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, స్థానిక డివిజన్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను తొలగించేందుకు కృషి చేసి స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు తనవంతు పూర్తి సహకారం అందించారు.

 ఈ నేపథ్యంలో వడ్డేపల్లి రాజేశ్వర రావు, డివిజన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నూతనంగా నిర్మించిన మట్టి రోడ్డును ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలకు ఈ రోడ్డు నిర్మాణం కొంత ఉపశమనం కలిగించింది.రోడ్డు ప్రారంభంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, కాలనీ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా తమ పూర్తి సహకారం అందిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వడ్డేపల్లి రాజేశ్వరరావుకి అండగా ఉంటామని వారు తెలిపారు. 

ఈ సందర్భంగా ముఖ్యఅతిథి శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం మనందరి బాధ్యత. గత 15 సంవత్సరాలుగా రహదారి సౌకర్యం లేక స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మాణానికి సహకరించి. ప్రజలకు కనీస రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశామని తెలియజేస్తూ. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని.శక్తి నగర్ కాలనీ అభివృద్ధికి అవసరమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని”  రోడ్డు నిర్మాణంలో డివిజన్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మరియు మిగతా నాయకుల కృషిని వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు అభినందిస్తూ, రాబోయే రోజుల్లో కూకట్ పల్లిలో కాషాయ జెండా ఎగరేస్తామని వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పేర్కొన్నారు.

 డివిజన్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ మహిళా మోర్చా నాయకులు విజయ భవాని, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి యంజల పద్మయ్య, ఓబీసీ మోర్చా జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కోడిచెర్ల వినోద్,బిజెపి సీనియర్ నాయకులు తూము శైలేష్, ఐలయ్య, జీవన్, శేఖర్ గుప్తా, పిట్ల మనోహర్, ఈ.సాయి మరియు స్థానిక డివిజన్ నాయకులు రాజేందర్ గౌడ్ (బబ్లు), మనోజ్, శ్రీనివాస్ చారి, కృష్ణ యాదవ్, చక్రవర్తి వంశీ నేత కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.