BREAKING
ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్! అమరవీరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాలి కాకినాడ జీజీహెచ్‌ను 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు విశ్రాంత ఉద్యోగుల హక్కులకై అవిశ్రాంత పోరాడతాం. కాకాణికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు *తీగలకుంటపల్లి రెడ్డి సంఘం నూతన  అధ్యక్షుడిగా మూల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక ఘనంగా మాజీ మంత్రి కాకాణి జన్మదిన వేడుకలు కుందారంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం సిద్ధలకోనలో 167 నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం!12 రాశులకు అనుగుణంగా నాగదేవతల శిలలు.. ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి జీఎంఆర్ ఐటీలో విద్యార్థుల విజ్ఞాన పర్యటన సిఆర్పి సంతోష్ ను పరామర్శించిన ఉపాధ్యాయులు *మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన గవ్వ వంశీధర్ రెడ్డి

రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో పథకాలు సాధించిన కామారెడ్డి పోలీసులు అభినందించిన జిల్లా ఎస్పీ

Select Suryaa Now
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో పథకాలు సాధించిన కామారెడ్డి పోలీసులు అభినందించిన జిల్లా ఎస్పీ
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : వరంగల్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు, క్రీడా పోటీలు–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం ఒక స్వర్ణం, ఎనిమిది కాంస్య పతకాలు సాధించి జిల్లా పోలీస్ శాఖకు గుర్తింపు తీసుకురాగా, పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా పోలీస్ కార్యాలయానికి ఆహ్వానించిన జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర,వారిని ప్రత్యేకంగా అభినందించి, వారి క్రీడా ప్రతిభను ప్రశంసించారు.బ్యాడ్మింటన్‌లో: భిక్నూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బి. లక్ష్మి మహిళల 40 ప్లస్ సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. డీఏఆర్ కామారెడ్డికి చెందిన ఎల్. బాబాగౌడ్, బి. లక్ష్మి 40 ప్లస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు.ఖోఖోలో: బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన డి. బుజ్జి కాంస్య పతకం సాధించారు.హ్యాండ్‌బాల్‌లో: డీఏఆర్ కామారెడ్డికి చెందిన ఎం. రేఖ, జి. శోభ, పిట్లం పోలీస్ స్టేషన్‌కు చెందిన కె. ప్రియాంక, బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బి. సవితారాణి, పెద్దకొడప్‌గల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఛి. వాసవి కాంస్య పతకాలు సాధించారు.జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ…“పోలీస్ విధులు నిర్వహిస్తూనే క్రీడల పట్ల ఆసక్తి, అంకితభావంతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ క్రీడల్లోనూ ప్రతిభ చాటుకోవడం వారి పట్టుదలకు, కృషికి నిదర్శనం. వీరి విజయాలు ఇతర మహిళా పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధిస్తూ కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను” అని జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర,  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ  కె. నరసింహ రెడ్డి, డీఎస్పీలు గటుమాల్, ఉదయ భాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సంపత్, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, నవీన్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.