BREAKING
ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్! అమరవీరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాలి కాకినాడ జీజీహెచ్‌ను 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు విశ్రాంత ఉద్యోగుల హక్కులకై అవిశ్రాంత పోరాడతాం. కాకాణికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు *తీగలకుంటపల్లి రెడ్డి సంఘం నూతన  అధ్యక్షుడిగా మూల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక ఘనంగా మాజీ మంత్రి కాకాణి జన్మదిన వేడుకలు కుందారంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం సిద్ధలకోనలో 167 నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం!12 రాశులకు అనుగుణంగా నాగదేవతల శిలలు.. ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి జీఎంఆర్ ఐటీలో విద్యార్థుల విజ్ఞాన పర్యటన సిఆర్పి సంతోష్ ను పరామర్శించిన ఉపాధ్యాయులు *మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన గవ్వ వంశీధర్ రెడ్డి

పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Select Suryaa Now
పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య మంచిర్యాల : ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు,పనులను గుర్తించి,నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి అధికారులతో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ దరఖాస్తులు,అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జి.ఓ. నంబర్ 76, 58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులు, భూ భారతి కార్యక్రమం,భూముల రీ-సర్వే,కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.జి.ఓ. నం.76,58,59 లకు సంబంధించిన దరఖాస్తుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి,అర్హత కలిగిన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు.భూ భారతి కార్యక్రమంలో భాగంగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని తెలిపారు.రీ-సర్వేకు సంబంధించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని,భూ రికార్డుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల క్రింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు మంజూరు చేసేందుకు అవసరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని,నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించుకొని,ప్రజలకు సంబంధించిన సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని తెలిపారు.