BREAKING
టాటా సన్స్ వంటి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఎన్‌డీటీవీ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరణ జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా! ధరల స్థిరత్వమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం: తేల్చిచెప్పిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్! అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ

నేటి నుంచి నగరంలో జీఏఎన్ఎస్ఐడీ కాంగ్రెస్ 2026 సదస్సు

Select Suryaa Now
నేటి నుంచి నగరంలో జీఏఎన్ఎస్ఐడీ కాంగ్రెస్ 2026 సదస్సు

 

అమీర్‌పేట,మేజర్ న్యూస్:రక్త సంబంధిత వ్యాధులకు సంబంధించిన అంశాలపై చర్చా వేదిక కానున్న జీఏఎన్ఎస్ఐడీ కాంగ్రెస్ 2026 నగర వేదికగా ప్రారంభం కానుంది. నేటి నుంచి జరిగే ఈ నాలుగో ఎడిషన్ సదస్సులో సికిల్ సెల్ ఎనీమియా,తలసేమియా,ఇతర వంశపారంపర్య రక్త సంబంధిత వ్యాధుల గురించి చర్చించనున్నారు.అందుకు సంబంధించిన వివరాలను గ్లోబల్ యాక్షన్ నెట్వర్క్ ఫర్ సికిల్ సెల్ అండ్ అదర్ ఇన్‌హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్స్ (జీఏఎన్ఎస్ఐడీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాన్రే తుంజి అజాయి,తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్ అగర్వాల్ వెల్లడించారు.ఈ విషయమై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సదస్సు జీఏఎన్ఎస్ఐడీ సంస్థతో భాగస్వామ్యం ద్వారా రక్త సంబంధిత వ్యాధుల నివారణకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.అంతేకాకుండా సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడం,రోగులకు,వారి కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ,మద్దతు వ్యవస్థలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సదస్సుకు 27 దేశాలకు చెందిన వక్తలతో పాటు మొత్తం 700ల మంది రిజిస్టర్డ్ ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. జాతీయ,అంతర్జాతీయ వైద్య నిపుణులు,పరిశోధకులు,ఆరోగ్య సంరక్షణ నిపుణులు,రోగుల సంఘాల ప్రతినిధులు, పాలసీ రూపకర్తలు,వంశపారంపర్య రక్త సంబంధిత వ్యాధుల రంగంలో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమావేశంలో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ చీఫ్ మెడికల్ రీసెర్చ్ ఆఫీసర్,సెక్రటరీ డాక్టర్ సుమన్ జైన్,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రత్నావళి, జాయింట్ సెక్రటరీ అలీమ్ బేగ్,మనోజ్ రూపణి,నరేష్ రాఠి తదితరులు పాల్గొన్నారు.