మాజీ మంత్రి హరీశ్ రావును కలిసిన శంభీపూర్ క్రిష్ణ
దుండిగల్ మేజర్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు శంభీపూర్ క్రిష్ణ మాజీ మంత్రి హరీశ్ రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ రావుకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తాజా మాజీ కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, పాల్పనూరి విష్ణు వర్ధన్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ అర్కల జీతయ్య ముదిరాజ్, దుండిగల్ సర్కిల్ బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు శామీర్‌పేట్ రంగయ్య, నాయకుడు శ్రీశైలం యాదవ్ తదితరులు హాజరయ్యారు. దసరా పండుగ సందర్భంగా నేతల పరస్పర శుభాకాంక్షలతో ఈ భేటీ జరిగింది.