BREAKING
జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా! ధరల స్థిరత్వమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం: తేల్చిచెప్పిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్! అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా

కోకాపేటలో గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి

Select Suryaa Now
కోకాపేటలో గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి

హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):నగరంలో తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు శుద్ధి చేసిన నీటిని తాగునీరు యేతర అవసరాలకు వినియోగించేలా జలమండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కోకాపేటలోని గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి గురువారం సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఫిల్లింగ్ స్టేషన్‌లోని నీటి నాణ్యత పరీక్షల ప్రయోగశాలను పరిశీలించిన ఎండీ.. పరీక్షల నిర్వహణ, వివిధ నాణ్యతా ప్రమాణాలు, ఫలితాల నమోదు ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), జలమండలి సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత ప్రమాణాల ప్రకారం క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు వాటిని జలమండలి ప్రధాన కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించేలా అనుసంధానించాలని సూచించారు. ఇందుకోసం జలమండలి ఐటీ విభాగంతో సమన్వయం చేసుకుని అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. నీటి నాణ్యతకు సంబంధించిన రికార్డులు పారదర్శకంగా, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.అలాగే ట్యాంకర్లలో నింపే నీటి పరిమాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వివిధ సామర్థ్యాల ట్యాంకర్లకు అనుగుణంగా వేర్వేరు ఫిల్లింగ్ పరిమితులను నిర్దేశించి, ప్రతి ట్యాంకర్‌లో నింపిన నీటి పరిమాణంతో పాటు ఫిల్లింగ్ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.

ట్యాంకర్లలో నిర్ణీత పరిమాణానికి మించి నీరు నింపకుండా నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అదనంగా వచ్చే నీరు వృథా కాకుండా తిరిగి సంబంధిత చెరువులోకి మళ్లించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణ రంగం, పారిశ్రామిక అవసరాలకు, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ, ఉద్యానవనాల నిర్వహణ తదితర తాగునీరు అవసరం లేని పనులకు వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వహణలో నీటి నాణ్యత, సరఫరా పరిమాణం, భద్రతా ప్రమాణాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్టీపీ సీజీఎం పద్మజ ఇతర అధికారులు పాల్గొన్నారు.