BREAKING
అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు.

కొడంగల్ వెంకన్న ఆలయానికి మహర్దశ.. పునర్నిర్మాణ పనుల పరిశీలనతో పాటు ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ కలయిక

Select Suryaa Now
కొడంగల్ వెంకన్న ఆలయానికి మహర్దశ.. పునర్నిర్మాణ పనుల పరిశీలనతో పాటు ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ కలయిక
కొడంగల్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పేదల తిరుపతిగా పేరొందిన ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు బాలాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పునర్నిర్మాణ పనులను పకడ్బందీగా చేపట్టి, దేవస్థానాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లోని తన నివాసంలో నియోజకవర్గ ప్రజలు, స్థానిక నాయకులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, నాయకులు ముఖ్యమంత్రిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
 
 ఈ సందర్భంగా సీఎం ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.పండుగ వేళ ముఖ్యమంత్రి నివాసానికి ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కొడంగల్‌లో సందడి నెలకొంది. ఒకవైపు ప్రసిద్ధ ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన, మరోవైపు నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమావేశంతో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 
రిపోర్టర్: ఆబిద్, కొడంగల్, వికారాబాద్ జిల్లా.