గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవిని బీసీలకు కేటాయించాలి..
సూర్య కరీంనగర్ నవంబర్ రెండవ వారంలో భర్తీ కనున్న గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి బీసీలకు కేటాయించాలని అధికార పార్టీ బిసి అభ్యర్థులకు బీసీ ఉద్యమానికి బలహీన వర్గాల కోసం జీవితాన్ని త్యాగం బిసి నాయకులకు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం పక్షాన కోరుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ తెలిపారు..బలహీన వర్గాల సమస్యలు నిరుద్యోగ సమస్యలు విద్యార్థుల సమస్యలు కొరకు పోరాటం చేసే అవకాశానికి గవర్నర్ కోటాఎమ్మెల్సీగా బీసీల నుండి ఎలాంటి పోటీ చేయకుండా పార్టీలు అవకాశం కల్పించాలని బీసీ సంఘాల పక్షాన అధికార పార్టీలను కోరడం జరుగుతుందని తెలిపారు.. ఇలా బీసీ నాయకులకు మద్దతు ప్రకటిస్తే బీసీల సంక్షేమానికి పార్టీలు కట్టుబడి ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి అన్ని పార్టీలు ఆలోచించాలని బీసీ సంక్షేమ సంఘం పక్షాన కోరుతున్నాము..