telangana
ఎంపికీ గ్రామస్థుల సన్మానం
సూర్య,గుడిహత్నూర్: అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని తోషం గ్రామస్థులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తోషం గ్రామ ప్రజలు తనపై చూపించిన అభిమానం, ఆదరణ వల్లే ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఎదిగిఈ స్థాయికి చేరుకున్నాననిపేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం ప్రజాసేవకు కృషి చేస్తామన్నారు. ఎంపీకి సన్మానం చేసిన వారిలో ముస్కు విజయ్‌రెడ్డి, సోయం సతీష్, కుంట నారాయణ, భీంరావు, గ్రామస్థులు తదితరులు ఉన్నారు