BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ఘనంగా వీడ్కోలు కన్నుల పండువగా దుర్గమ్మ శోభాయాత్ర

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ఘనంగా వీడ్కోలు కన్నుల పండువగా దుర్గమ్మ శోభాయాత్ర

కొల్చారం;దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా దుర్గమ్మ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేపట్టి అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు.దుర్గ భవాని అమ్మవారు వీధుల గుండా శోభాయాత్రగా భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి మంగళహారతులు అందిస్తూ భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య దుర్గమ్మ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.ఈ కార్యక్రమంలో కొల్చారం ఉపసర్పంచ్ కోరంపల్లి రాణి గోపి తో పాటు దుర్గ భవాని ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.