BREAKING
మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు దర్శనం.. ఉపాధి నైపుణ్యాలే లక్ష్యంగా ఇంటర్న్‌షిప్‌ * పదో తరగతి విద్యార్థులకు పది రోజుల పాటు శిక్షణ స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రేపు రాజకీయ పార్టీల సమావేశం గుర్లలో టీడీపీ, జనసేన మధ్య ఒప్పందం వైసిపి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా బోయ మౌనిక. టీ.జీ.పీ.ఎస్.సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ అధ్యక్షులు కోణం విట్టల్. *ఇల్లు లేని నిరుపేదలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి ఎమ్మార్వో మల్లేశం* 23 నుంచి అఖిలభారత డ్వాక్రా బజార్ (సరస్) ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ప్రారంభం వి ఎస్ ఆర్ సీ ఫుడ్స్ ఆధ్వర్యంలో "మొలకపోలేరమ్మ "కు ప్రత్యేక పూజలు భ్రమరాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు-సుగుణ రెడ్డి-విజయ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం రిటర్నింగ్ అధికారిగా మహారాజన్ బాధ్యతల స్వీకరణ విజయదశమి స్ఫూర్తితో విజయపథంలో సాగుదాం

బతుకమ్మలతో.. పాఠశాల ప్రాంగణం కళకళ!

Select Suryaa Now
బతుకమ్మలతో.. పాఠశాల ప్రాంగణం కళకళ!

చౌటుప్పల్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మున్సిపల్‌ చైర్మన్‌ మొగుదాల పావని రమేష్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పావని రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీక అని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే పండుగల విశిష్టతను తెలుసుకోవడంతోపాటు, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందించుకోవాలని సూచించారు.పాఠశాల కరస్పాండెంట్‌ గుత్తా గోపాల్‌రెడ్డి కవిత మాట్లాడుతూ.. విద్యతోపాటు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థినులకు తెలియజేస్తూ, మన సంప్రదాయాలను కాపాడుకోవాలనే భావనను వారిలో పెంపొందిస్తున్నామన్నారు.విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ వేడుకల్లో సందడి చేశారు. పూలతో అలంకరించిన బతుకమ్మలతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉయ్యాల రమేష్ మరియు అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.