BREAKING
ఉపాధి నైపుణ్యాలే లక్ష్యంగా ఇంటర్న్‌షిప్‌ * పదో తరగతి విద్యార్థులకు పది రోజుల పాటు శిక్షణ స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రేపు రాజకీయ పార్టీల సమావేశం గుర్లలో టీడీపీ, జనసేన మధ్య ఒప్పందం వైసిపి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా బోయ మౌనిక. టీ.జీ.పీ.ఎస్.సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ అధ్యక్షులు కోణం విట్టల్. *ఇల్లు లేని నిరుపేదలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి ఎమ్మార్వో మల్లేశం* 23 నుంచి అఖిలభారత డ్వాక్రా బజార్ (సరస్) ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ప్రారంభం వి ఎస్ ఆర్ సీ ఫుడ్స్ ఆధ్వర్యంలో "మొలకపోలేరమ్మ "కు ప్రత్యేక పూజలు భ్రమరాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు-సుగుణ రెడ్డి-విజయ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం రిటర్నింగ్ అధికారిగా మహారాజన్ బాధ్యతల స్వీకరణ విజయదశమి స్ఫూర్తితో విజయపథంలో సాగుదాం *ఎన్నికల పరిశీలకులు తేజ్ భరత్ విస్తృత పర్యటన

బాపూజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం:మల్లేష్ యాదవ్

Select Suryaa Now
బాపూజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం:మల్లేష్ యాదవ్

చౌటుప్పల్‌:  పట్టణ కేంద్రంలో స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చినుకని మల్లేష్‌ యాదవ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మల్లేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం బాపూజీ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆయన సేవలను స్మరించుకోవడమే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఓబీసీ పట్టణ అధ్యక్షుడు చీకురి సాయిరాం, గోశిక భావనఋషి తదితరులు పాల్గొన్నారు.