BREAKING
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు నేరేడుచర్ల హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ పండుగ* అనంత లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు దసరా వేడుకలు నేడు పెదపులివర్రు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్తుకు అంతరాయం బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీది కపట ప్రేమ.. పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే కలెక్టర్ ప్రతిమాసింగ్ కీసరలో పేలుడు పదార్థాల అక్రమ విక్రయం గుట్టురట్టు..! పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు* వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి రాజకీయ పార్టీలు ఏకమైనా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు.. ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి పూల పండుగకు ఆక్స్‌ఫర్డ్‌లో ఘన స్వాగతం* భర్త మద్యానికి బానిసై వేధిస్తున్నాడని వివాహిత ఆత్మహత్య *మధిర లో టి.ఏస్ ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతం* *కౌంటియ ప్రక్రియ పూర్తి* మొదటి విడతలో మొదలు పెట్టని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక ఫోకస్ కలెక్టర్ సెన్సార్ పూర్తి చేసుకున్న శివకుమార్ ‘చంద్రయాన్’.. ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ…..

Select Suryaa Now
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ…..

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్….

 షాద్ నగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు…

 తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మున్సిపల్ చైర్మన్ బసవేశ్వరులు అన్నారు. ప్రకృతిని పూజించే గొప్ప సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు షాద్ నగర్ లో ఘనంగా జరిగాయి. పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్స్ బతుకమ్మ పాటలు, ఆటలతో మార్మోగిపోయింది. 

ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్ ముదిరాజ్ హాజరై సందడి చేశారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు ఆడిపాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, రఘు నాయక్, కౌన్సిలర్ సి.పెంటయ్య, మురళీ మోహన్, కొప్పునూరి ప్రవీణ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు, మహిళలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

M. నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్…