స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
పరకాల, సెప్టెంబర్ 24 ,మేజర్ న్యూస్
తమతోపాటు కలిసి చదువుకున్న మిత్రునికి ఆర్థిక సాయం అందించారు. మొగుళ్ళపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎస్సి 2009వ సంవత్సరంలో పదవ తరగతి బ్యాచ్ కి చెందిన ఆకుతోట దినేష్ తండ్రి ఆకుతోట ఆదిరెడ్డి అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. దీంతో ఆకుతోట దినేష్ తో కలిసి చదువుకున్న స్నేహితులు తమ మిత్రుడికి14వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. తమతో చదువుకున్న మిత్రుడి తండ్రి మృతి చెందడంతో ఆర్థిక సాయం అందించి తోడుగా నిలిచారు. కార్యక్రమంలో అన్నపురెడ్డి కుమారస్వామి, గిరుగుల విక్రం, అచ్చ ప్రశాంత్, బుర్రి కిరణ్ , ఇంజపెల్లి అశోక్ , రాజు, మహేష్, తిరుపతి దయాకర్ తదితరులు పాల్గొన్నారు