telanagana
సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయాలి - బీఆర్ఎస్ నాయకుల పిలుపు
సూర్య, మందమర్రి: ఈ నెల 14న గోదావరిఖనిలో నిర్వహించనున్న సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచన మేరకు శనివారం పట్టణంలోని టిబిజికేఎస్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సభకు పట్టణం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, టిబిజికేఎస్ యూనియన్ నాయకులు, సింగరేణి కార్మికులు, యువ నాయకులు భారీ సంఖ్యలో తరలిరావాలని నాయకులు సూచించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, టిబిజికేఎస్ యూనియన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, సెంట్రల్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ బెల్లం అశోక్, పార్టీ సీనియర్ నాయకులు ఎండి అబ్బాస్, బత్తుల శ్రీనివాస్, కొంగల తిరుపతిరెడ్డి, బోరిగం వెంకటేష్, బర్ల సదానందం, భూపెల్లి కనుకయ్య, కనకం రవి, పల్లె నర్సింగ్, మేడిపల్లి మల్లేష్, దాసరి రాజనర్సు, శంకర్, పూసల ఓదెలు, మొగురం శ్రీనివాస్, రవివర్మ, రమేష్, తోగరి వెంకటేష్, మటన్ శేఖర్, వొద్దం సాగర్, నరహరి, 16 వ వార్డు రమేష్, యువ నాయకులు బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్, ఎండి ముస్తఫా, సీపెల్లి సాగర్, రామ్ సురేష్, అందే శ్రీకాంత్, సంగర్తి సంతోష్, ముల్కల రమేష్, తోట వేణు, శనిగారపు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.