BREAKING
తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ ఢిల్లీలో భవనాల భద్రత, పీజీ నిబంధనలపై ఎల్జీ తరంజిత్ సింగ్ సంధు సమీక్ష గోవా పోలీసులకు రాష్ట్రపతి పతాకాన్ని ప్రదానం చేసిన అమిత్ షా ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యవర్తులపై కఠిన చర్యలు యూట్యూబర్ నందన అరెస్ట్ 2047 నాటికి వికసిత భారత్ సాధనకు ప్రతి గ్రామం, పౌరుడు వికసితంగా మారాలి జీ20 సమావేశంలో ఏఐ, సెమీకండక్టర్లపై ప్రపంచ సహకారానికి భారత్ పిలుపు ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి అక్టోబర్ 6న ఉప ఎన్నికలు మహిళల రాజకీయ నాయకత్వానికి 33 శాతం రిజర్వేషన్ కొత్త మార్గాలను తెరుస్తుంది రాష్ట్రాల భాగస్వామ్యంతో కేవీకేల బలోపేతం

తెలంగాణలో మళ్లీ వర్షాలు…

Select Suryaa Now
తెలంగాణలో మళ్లీ వర్షాలు…

20 జిల్లాలకు అలర్ట్ జారీ

తెలంగాణలో మళ్లీ ప్రారంభమైన వర్షాలు

రాష్ట్రంలోని 20 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:

తెలంగాణలో వర్షాలు మళ్లీ పుంజుకున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేస్తూ.. రాజధాని సహా ఆరు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరో 14 జిల్లాలకు ‘యెల్లో అలర్ట్’ జారీ చేసింది.

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.