పిఆర్టియు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా కట్ట శేఖర్ రావు, ఆర్ రంగారావు ఎన్నిక
--పి ఆర్ టి యు నూతన కమిటీ ఎన్నిక
--ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కట్టా శేఖర్ రావు , ప్రధాన కార్యదర్శిగా ఆర్. రంగారావు
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్);
పిఆర్టియు ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గాన్ని రాబోయే రెండేళ్ల కాలానికి ఏకగ్రీవంగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కట్టా శేఖర్ రావు , ప్రధాన కార్యదర్శిగా ఆర్.రంగారావు లను ఎన్నుకున్నారు . పిఆర్టియు సంఘ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు . సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు టీ. జితేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి టీ. నరేష్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు . అసోసియేట్ అధ్యక్షులుగా జి. విజయ్ , అమృత్ కుమార్ , ఆర్. బ్రహ్మారెడ్డి , మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా జి. సుజాత ఉపాధ్యక్షులుగా టీ. రత్నకుమార్ , ఏ.సోమ్లా , బోబోలు శ్రీనివాసరావు , కొమ్ము శ్రీనివాసరావు , డి. రవికుమార్ , కార్యదర్శులుగా బి. కమలాకర్ రెడ్డి , తాల్లూరి చంద్రశేఖర్ , బి. రాములు , కె. దయాకర్ లు ఎన్నికయ్యారు . ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు , రాష్ట్ర , జిల్లా , మండల కార్యవర్గ సభ్యులు మరియు పిఆర్టియు కార్యకర్తలు పాల్గొన్నారు .