నేడే మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం.
సూర్య, నాగిరెడ్డి పేట్:మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు ప్రభుత్వం నామినేట్ పద్ధతిలో నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జరిచేసింది. దీంతో మాల్తుమ్మెద సహకార సంఘంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం చెయనున్నట్లు సొసైటీ సీఈవో సందీప్ కుమార్ తెలిపారు. సొసైటీ అధ్యక్షుడిగా కలాలి సురేందర్ గౌడ్ తోపాటు నియామకమైన 12 మంది డైరెక్టర్లు కొమ్మ గల్ల భీమయ్య, షేక్ అసీఫ్, పెద్దప్పట్లోళ్ల మహేశ్వర్ రెడ్డి, గంపల వెంకయ్య, విట్టల్ రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి, మూడేరు సాయిరాం, సిందిగారి సుజాత, రాజిపేట యాదగిరి, జి. సాయికుమార్, సిహెచ్. భూపాల్ రెడ్డి, పర్మల్ల దుర్గమ్మ, బారాధి ప్రతిభ,లు ప్రమాణస్వీకారం చేయనున్నారు.