BREAKING
డార్లింగ్ పుట్టినరోజున ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే ట్రీట్: సాలిడ్ యాక్షన్ గ్లింప్స్‌కు రంగం సిద్ధం! కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైడ్రా కమీషనర్ “క్షమాపణ చెప్తారనుకున్నా.. డైవర్షన్ చేస్తున్నారు” కెసిఆర్ మరణాన్ని కోరడం ఎమ్మెల్యే స్థాయికి తగదు విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్

కెసిఆర్ మరణాన్ని కోరడం ఎమ్మెల్యే స్థాయికి తగదు

Select Suryaa Now
కెసిఆర్ మరణాన్ని కోరడం ఎమ్మెల్యే స్థాయికి తగదు


కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆగ్రహం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 8): మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరణాన్ని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని మాజీ తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పటేల్ అన్నారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే రాజకీయ ప్రత్యర్థి మరణాన్ని కోరుకోవడం తెలంగాణ రాజకీయ సంస్కృతికి మాయని మచ్చ అని విమర్శించారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రత్యర్థుల సిద్ధాంతాలు, విధానాలను విమర్శించే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, వ్యక్తిగతంగా ఒక నాయకుడి మరణాన్ని కోరుకునే స్థాయికి రాజకీయాలు దిగజారడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కీలకంగా పోరాడారని, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. కేసీఆర్ విధానాలపై విమర్శలు ఉంటే రాజకీయంగా సమాధానం చెప్పాలని, కానీ ఆయన మరణాన్ని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి
ఒక ఎమ్మెల్యే బహిరంగంగా మాజీ ముఖ్యమంత్రి మరణాన్ని కోరుతూ వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలను పార్టీ సమర్థిస్తుందా? లేక ఖండిస్తుందా? ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
“ప్రజలు మీకు ఎమ్మెల్యేగా బాధ్యత ఇచ్చింది ప్రజా సమస్యల కోసం పోరాడటానికా? లేక రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడానికా?” అంటూ వీర్లపల్లి శంకర్‌ను ప్రశ్నించారు.
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పనితీరుపై మాట్లాడాలని సూచించారు. అయితే వ్యక్తుల మరణాన్ని కోరుకునే రాజకీయ సంస్కృతిని తెలంగాణ సమాజం అంగీకరించదని అన్నారు.
వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి, స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.