telanagana
కన్నెపల్లిలో మోతిగూడ అవ్వల్ పెన్ (పోచమ్మ తల్లి) ప్రత్యేక దసరా పూజలు
సూర్య జైనూర్ : కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా, లింగాపూర్ మండలం, జాముల్ధర గ్రామపంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామంలో మోతిగూడ అవ్వల్ పెన్ (పోచమ్మ తల్లి)కు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక దసరా పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని మోతిగూడియా కనక వంశీయులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం దసరా పండుగకు వారం రోజుల ముందు నిర్వహించే ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఈసారి కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి 12 గంటలకు మోతిగూడ అవ్వల్ పెన్ పూజలు, శుక్రవారం ఉదయం బేతల్ పెన్ పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.పూజా కార్యక్రమాల ఏర్పాట్లపై చర్చించేందుకు మార్లవాయి గ్రామంలో మోతిగూడియా కనక వంశీయులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పూజల నిర్వహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.ఈ పూజా కార్యక్రమాలకు మోతిగూడియా కనక వంశీయులతో పాటు అన్ని సగాల పరివార్ సభ్యులు, బంధుమిత్రులు, ఆదివాసీ కుటుంబాల సభ్యులు హాజరై ఆదివాసీ సంప్రదాయాలను కొనసాగిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మోతిగూడియా అవ్వల్ పెన్ గుడి నిర్మాత కనక సోనేరావ్ మాస్టర్, గణపత్ దేవారి, హన్మంత్ రావ్ దేవారి, అమృత్, వెంకటేశ్వర్, తుకారాం, జూగాది రావ్, సడే ఆత్రం భగవత్ రావ్, తెలంగారావ్, లంకేష్, శ్రీను, భీము, సాయి, సతీష్, ఎత్మ, విషయం తదితరులు పాల్గొన్నారు.