BREAKING
విద్యార్థులకు చట్ట సభల నిర్వహణపై అవగాహన కల్గి ఉండాలి కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖుతుబోద్దీన్ పాషా రైతుల సంక్షేమమే మోమిన్‌పేట్ పీఏసీఎస్ లక్ష్యం యూ అండ్‌ ఏ సర్టిఫికేట్ పూర్తి చేసుకున్న చకోర సినిమా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ పుంగనూరులో రైతు బజార్ ప్రారంభించిన మధుసూదన్ నాయుడు! శాంతినగర్‌లో ఘనంగా 'అంగన్‌వాడీ ఉత్సవం'.. కార్యకర్తలకు సన్మానం, పోషణ్ సామాగ్రి పంపిణీ తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయం: నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబువడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చొరవతో సిసి రోడ్డు ఉప్పల చిలక యుపిఎస్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ తత్వం సినిమాలోని ఉత్కంఠ ప్రతి ఒక్కరికీ అద్భుతమైన థ్రిల్‌ను పంచుతుంది.. దర్శకుడు అర్జున్ కోలా ఇంటర్వ్యూ సీఎం పర్యటనకు ముందు భద్రతా రిహార్సల్స్‌ సాధారణమే: అధికారులు జిల్లా పరిషత్ చైర్మెన్ గా గంధం నేతాజీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవో సంఘంలో సభ్యత్వ నమోదు నమోదు కార్యక్రమం కార్మికుల హక్కుల కోసం ఐక్య పోరాటం చేస్తాం కాంగ్రెస్ ఫై బీజేపీ నేత నల్లా విమర్శలు

గురుకుల పాఠశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

Select Suryaa Now
గురుకుల పాఠశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

*గురుకుల పాఠశాలలో పరిశుభ్రత కు ప్రాధాన్యతనివ్వాలి*

*వసతులు బాగుండేలా చర్యలు చేపట్టాలి*

*టైం టేబుల్ ప్రకారం సిలబస్ పూర్తి కావాలి*


*హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి*

*వేలేరులోని రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్*
ధర్మసాగర్ సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్ సూర్య..
గురుకుల పాఠశాలలో పరిశుభ్రత ప్రాధాన్యత నివ్వాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. 
బుధవారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రం లోని రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. 
ముందుగా విద్యార్థులతో మాట్లాడి ఈరోజు ఎం బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు.. వంటలు ఎలా ఉంటున్నాయి, టీచర్లు అందరూ వస్తున్నారా అని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు .
ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో, కళాశాలలోని తరగతి గదులు, డార్మేట్రీ వసతులను కలెక్టర్ పరిశీలించారు. అన్నీ గదుల్లో విద్యార్థులకు సౌకర్యవంతంగా ఫ్యాన్ లు ఉన్నాయా అని ఆరా తీశారు. దోమలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. 
ప్రతిరోజు డార్మేట్రి, టాయిలెట్స్ శుభ్రం చేస్తున్నారా అని ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తున్నారా, టైం టేబుల్ ప్రకారం అన్నీ తరగతులు జరుగుతున్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. 
వంట గదిని సందర్శించి వంట పదార్థాలు ఎలా ఉన్నాయని తనిఖీ చేశారు. 
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ... టైం టేబుల్ ప్రకారం అన్నీ తరగతుల సిలబస్ ను ఉపాధ్యాయులు పూర్తి చేయాలన్నారు. 
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా డార్మేట్రీ గదులకు మెష్ డోర్ లను ఏర్పాటు చేయాలన్నారు. 
వసతులు బాగుండేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, ఇతర ఆహార పదార్థాలను నాణ్యతతో అందించాలన్నారు.
కూరగాయలు, నిత్యావసరాలు తాజాగా, నాణ్యతగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాదగిరి, తహసీల్దార్ కోమీ,  వైస్ ప్రిన్సిపల్ సజన, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.