BREAKING
సిపిఎస్ రద్దు చేయాలి -పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలి తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, 2018 నుంచి పెండింగ్ లోని 48 నెలల డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఏపీ సిపిఎస్ ఎ ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి నెల్లూరు నగరంలో తొలి స్టేడియానికి శ్రీకారం.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి

ఈనెల 4న మధ్యాహ్నం కరీంనగర్ కు అమిత్ షా రాక

Select Suryaa Now
ఈనెల 4న మధ్యాహ్నం కరీంనగర్ కు అమిత్ షా రాక

 

బండి సంజయ్ తో కలిసి ప్రతిమ మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరుకానున్న అమిత్ షా..

ప్రతిమ డీమ్డ్ యూనివర్శిటీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్న అమిత్ షా..

అమిత్ షా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్..

సూర్య కరీంనగర్ ప్రతినిధి:కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలను ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 4న నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రతిమ డీమ్డ్ యూనివర్శిటీ భవన నిర్మాణ పనులకు అమిత్ షా చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన, కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలకు వచ్చారు. నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, ప్రతిమ కళాశాల యాజమాన్యం బోయినిపల్లి శ్రీనివాసరావు, చెన్నమనేని వికాస్ రావు, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ప్రతిమ కళాశాల అంతా కలియ దిరిగారు. పైలాన్ ఆవిష్కరణ, డీమ్డ్ వర్శిటీ పైలాన్ స్టోన్, ఫోటో ఎగ్జిబిషన్ పరిసరాలతోపాటు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఏర్పాటు చేసిన సభా స్థలాన్ని కూడా బండి సంజయ్ పరిశీలించారు.అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభ సమయంలో నాటి కేంద్ర హోంమంత్రి ఎల్ కే అద్వానీ, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నాటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సీహెచ్.విద్యాసాగర్ రావు చేతుల మీదుగా కాలేజీ భవనాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.  ఈనెల 4న జరగబోయే ప్రతిమ మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి హాజరు కాబోతుండటం సంతోషంగా ఉందన్నారు. ‘‘అమిత్ షా పర్యటనలో భాగంగా ప్రతిమ వర్శిటీ సిల్వర్ జూబ్లి వేడుకల నేపథ్యంలో పైలాన్ ఆవిష్కరిస్తారు. అట్లాగే డీమ్డ్ యూని వర్శిటీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో కలిసి నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు’’అని తెలిపారు.

అమిత్ షా పర్యటన షెడ్యూల్ వివరాలు…

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా ఈనెల 3న రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా బేగంపేటలోని గ్రాండ్ కాకతీయ హోటల్ లో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు బేగంపేట నుండి హెలికాప్టర్ లో మెదక్ జిల్లా తూప్రాన్ చేరుకుంటారు. అక్కడ సబర్ డెయిరీ ప్రొడక్ట్స్ మిల్క్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్ లో లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు తూప్రాన్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కళాశాల వద్దకు చేరుకుంటారు. మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరి వెళతారు.