BREAKING
బాలల దినోత్సవ పోటీలను నిర్వహించనున్న ఎస్.ఎన్.జి.ఎస్ సింగరకొండ అంజన్న క్షేత్రంలో వరుణ యాగం. మినీ క్రీడా మైదానం, సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతం చేయాలి శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి సహస్ర ఘటాభిషేకం బికరి తండా లో ఘనంగా పోషణ మహోత్సవ వేడుకలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం... బికారి తండ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా 'పోషణ మాసం' వేడుకలు బస్సు సౌకర్యం లేక అగర్‌గూడ విద్యార్థుల అవస్థలు ఎల్లూర్ పాఠశాలలో వసతుల కొరత క్షణికావేశంలో భర్తను హతమార్చిన భార్య, కొడుకు! చాయ్ వాలా సుధాకర్ మృతి ఉచిత యూజర్లకు గూగుల్ షాక్: జెమిని ఏఐపై పేవాల్.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు బీసీ జనసేన ఘన సత్కారం గాల్లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో తీవ్ర సంక్షోభం: మార్కెట్లో మారికో భారీ డీల్:

చికిత్స కోసం రూ.2 లక్షల అదనపు CMRF LOCఉప్పల్ ఎమ్మెల్యే కృషితో లలితకు ఆర్థిక సహాయం

Select Suryaa Now
చికిత్స కోసం రూ.2 లక్షల అదనపు CMRF LOCఉప్పల్ ఎమ్మెల్యే కృషితో లలితకు ఆర్థిక సహాయం

 

పెద్దపహాడ్ గ్రామానికి చెందిన రామగిరి లలిత, భర్త అశోక్ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మరో రూ.2 లక్షల అదనపు LOC మంజూరైంది.

లలిత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 03-10-2026న చేసిన విజ్ఞప్తి మేరకు ఈ అదనపు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఇప్పటికే 21-09-2026న మంజూరైన LOCకు అదనంగా ఈ రూ.2 లక్షల సహాయం అందించబడింది.

ఈ మొత్తాన్ని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS), పంజాగుట్టలో లలిత చికిత్సకు వినియోగించుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందేలా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో సాక్షి రిపోర్టర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు