BREAKING
సిపిఎస్ రద్దు చేయాలి -పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలి తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, 2018 నుంచి పెండింగ్ లోని 48 నెలల డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఏపీ సిపిఎస్ ఎ ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి నెల్లూరు నగరంలో తొలి స్టేడియానికి శ్రీకారం.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి

చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
చేర్యాల ; చేర్యాల: తపాస్పల్లి రిజర్వాయర్‌ నుంచి చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేర్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంత ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెద్ద చెరువుకు గోదావరి జలాలను తీసుకురావడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఎల్‌నినో వాతావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. గోదావరి జలాలు చేర్యాల పెద్ద చెరువుకు చేరడంతో రైతులకు సాగునీటి భరోసా కలగడంతో పాటు ప్రజలకు తాగునీటి సమస్యకు ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. చెరువులో నీటి నిల్వ పెరగడం ద్వారా భూగర్భ జలాలు కూడా వృద్ధి చెంది వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పూర్మ ఆగం రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, ఆడెపు చంద్రయ్య, కౌన్సిలర్లు వెలుగల దుర్గయ్య, పోతుగంటి ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు చెవిటి లింగం, ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీష్, ముస్త్యాల యాదగిరి, అంబాల రాములు గౌడ్, పచ్చిమడ్ల వెంకటయ్య, కాటం శ్రీనివాస్, పచ్చిమడ్ల సత్యనారాయణ, కాటం మల్లేశం, చింతల మల్లేశం, నీలం సన్నీ, తడ్కపల్లి చందు, బందెల మహిపాల్ రెడ్డి, సుద్దాల లక్ష్మణ్, తుమ్మలపల్లి సంతోష్, ఖాత శ్రీనివాస్, మల్లిగారి నర్సింలు, నీలం వినయ్, దినేష్, పాక చందు, కందూరి శ్రీశైలం, కందూరి రాజు తదితరులు పాల్గొన్నారు.