బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ప్రసన్న రాబర్ట్*
మాడ్గులపల్లి, మేజర్ న్యూస్: మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలోని హరిజనవాడ మండల ప్రజా పరిషత్ ఉన్నతపాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలోగ్రామపంచాయతీ సర్పంచ్ ఊర ప్రసన్న రాబర్ట్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, టీచర్లతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో పాట పాడుతూ ఆటలాడడం తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నకిరే కంటి కీర్తి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.