అఖిల భారత 36 వ రైతు మహా సభలను జయప్రదం చేయండి.. సి.పి. ఐ. (ఎం) నాయకులు మెరుగు సత్యనారాయణ,తూము సుధాకర్ పిలుపు
*అఖిల భారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయండి*
- *-సిపిఐ(ఎం) నాయకులు మెరుగు సత్యనారాయణ, తూము సుధాకర్ పిలుపు*
-
వైరా సూర్య మేజర్ న్యూస్ :--
నవంబర్ 15, 16, 17 తేదీల్లో నల్లగొండలో జరిగే అఖిల భారత 36వ కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ(ఎం) జిల్ల కార్యదర్శివర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ, వైరా మండల ఇంచార్జి తూము సుధాకర్ పిలుపునిచ్చారు. వైరా మండలం గన్నవరం గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతాంగ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న మొండి వైఖరి నశించాలన్నారు. నవంబర్ 15న మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. "ఇంటికో మనిషి - ఊరుకో బండి" తరలిరావాలని పిలుపునిచ్చారు.