BREAKING
UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ ​గోవా కోర్టులో లొంగిపోయిన ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ​పనాజీ: ఉమ్మడి జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరుని తొలి పూజలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మట్టి గణపతి తోనే పర్యావరణ పరిరక్షణ* *జిల్లా కలెక్టర్ బంగ్లాలో వినాయక చవితి పూజలు* వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం కార్గిల్ యుద్ధ వీరుడుపై ఇనుపరాడితో దాడి విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, పవిత్రమైన "వినాయక చవితి" సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్ యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం

​గోవా కోర్టులో లొంగిపోయిన ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ​పనాజీ:

Select Suryaa Now
​గోవా కోర్టులో లొంగిపోయిన ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ​పనాజీ:


‘తెహెల్కా’ పత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ సోమవారం గోవాలోని మపుసా (Mapusa) కోర్టు ఎదుట లొంగిపోయారు. 2013 నాటి లైంగిక దాడి కేసులో తనకు పడిన శిక్షపై దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించాలంటే ముందుగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కోర్టులో సరెండర్ అయ్యారు.
​2013 నాటి అత్యాచారం, లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన తేజ్‌పాల్‌ను కోర్టు ముందు లొంగిపోవాలని ఆగస్టులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లొంగుబాటు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. సరెండర్ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాతే అప్పీల్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
​అంతకుముందు, ఆగస్టు 6న బాంబే హైకోర్టు గోవా బెంచ్ తేజ్‌పాల్‌ను ఈ కేసులో దోషిగా నిర్ధారిస్తూ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2013 నవంబర్ 7, 8 తేదీల్లో గోవాలోని ఓ స్టార్ హోటల్ లిఫ్ట్‌లో తనపై తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.