వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 14):తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లభించి, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.విఘ్నాలను తొలగించే వినాయకుడి కృపతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, రాష్ట్రం మరింత ప్రగతి సాధించాలని కోరుకున్నారు. ప్రజలంతా వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు.