యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి
01 సూర్య బిక్కనూర్:
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన దివ్యవాణి(33) అనే వివాహిత సోమవారం హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. శనివారం రాత్రి మండలంలోని జంగంపల్లి శివారులో యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో మృతి చెందింది. కాగా యాసిడ్ దాడి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. గత మూడు నెలలుగా కుటుంబ కలహాలతో తల్లి గారి ఇంటి వద్ద ఉంటున్న దివ్యవాణి ఈనెల 11న ఇంటి నుండి వెళ్లింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాసిడ్ దాడి విషయంపై పోలీసులు అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నారు.