BREAKING
ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్ యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి తునిలో అంతుచిక్కని అదృశ్యం: వంద రోజులు గడిచినా దొరకని చిన్నారి ఆచూకీ నేటి నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం: భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు…. - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు… - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు…. వినాయక చవితి పూజా విధానం: విఘ్నేశుడికి ప్రీతికరమైన 21 పత్రాలు ఇవే! విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి సంక్రాంతి బరిలో మెగాస్టార్ డైలమా: ‘విశ్వంభర’ వర్సెస్ ‘కాకా’పై తుది నిర్ణయం ఎవరిది? బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ‘ఇరుముడి’ ప్రభంజనం: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ్యూవర్షిప్ పాలు కల్తీ అవుతున్నాయా?.. ఇలా సులభంగా గుర్తించండి! రామాయణం సినిమా నుంచి పండగ కానుకగా ప్రత్యేక అప్‌డేట్

కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్

Select Suryaa Now
కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన  ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్

తిరుమలగిరి మేజర్ న్యూస్ : తెలంగాణ కళాకారుల బతుకులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆటలాడుతున్నది అని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆరోపించింది. శాసనసభలో కళాకారుల పై కపట ప్రేమను చూపుతూ మాట్లాడిన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాల కోసం మేనిఫెస్టోలో పెట్టిన జీవోను  వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ఉద్యమ, నిరుద్యోగ కళాకారుల సంఘం.త్వరలోనే రాష్ట్ర కమిటీ నాయకులతో చర్చలు జరపాలని. సీఎం రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే 33 జిల్లాల కళాకారులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతూ 

చలో రవీంద్ర భారతి ముట్టడిస్తామని హేచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడి వేసి ఊరు ఊరు తిరిగి పోరుపాటలతో తెలంగాణ ధూంధాం చేసి మా జీవితాలను త్యాగం చేసినటువంటి కళాకారులను ఆనాడు ఆట పాట ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తమదైన ముద్ర వేసిన పాత్ర కళాకారులది అని అన్నారు.

కానీ అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు సాంస్కృతిక సారధిలో ఇచ్చి చేతులు దులుపుకున్నారు.అసలైన అర్హులైన నిజమైన కళాకారులకు తీరని అన్యాయం జరిగింది అని తెలిపారు.  ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు కళాకారులకు మొండి చేయి చూపించింది. పోనీ ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజులలోనే మీకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఆ తర్వాత ప్రభుత్వం గుర్తించి కళాకారులను ఆదుకుంటామని వెయ్యి ఉద్యోగాలు ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగిందని అన్నారుమా గాంధీభవన్ల లో 

మేనిఫెస్టోలో కూడా  పెట్టి ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగిందని ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలను మంత్రులను అధికారులను కలిసిన లాభం లేకుండా పోయిందని అన్నారు. Bఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి అర్హులైన కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో 1000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని హెచ్చరిస్తూ గిలకత్తుల రమెష్ గౌడ్ 

తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు డిమాండ్ చేశారు.