వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
టీడీపీ పామూరు మండల మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు
పామూరు, మేజర్ న్యూస్ :
వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ పామూరు మండల మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు కోరారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని వెంకటేశ్వర్లు కోరారు. రసాయన రంగులు లేని పర్యావరణహిత విగ్రహాలను వినియోగించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.