BREAKING
మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి తునిలో అంతుచిక్కని అదృశ్యం: వంద రోజులు గడిచినా దొరకని చిన్నారి ఆచూకీ నేటి నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం: భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు…. - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు… - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు…. వినాయక చవితి పూజా విధానం: విఘ్నేశుడికి ప్రీతికరమైన 21 పత్రాలు ఇవే! విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి సంక్రాంతి బరిలో మెగాస్టార్ డైలమా: ‘విశ్వంభర’ వర్సెస్ ‘కాకా’పై తుది నిర్ణయం ఎవరిది? బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ‘ఇరుముడి’ ప్రభంజనం: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ్యూవర్షిప్ పాలు కల్తీ అవుతున్నాయా?.. ఇలా సులభంగా గుర్తించండి! రామాయణం సినిమా నుంచి పండగ కానుకగా ప్రత్యేక అప్‌డేట్ హైదరాబాద్‌లో భారీగా పెరిగిన జీవన వ్యయం: గతం రూ.600.. నేడు రూ.1,500! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. కేజీ పసిడి లోహం రేటు ఎంతంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఇలా! నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు

నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు…. - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు… - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు….

Select Suryaa Now
నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు….  - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు…  - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు….

సూర్య నాగిరెడ్డిపేట్ :

పార్వతీ పారమేశ్వరుల ప్రాణ పుత్రుడు. గణనాథుడు నేడు కొలువుదీరనున్నాడు. ఉండ్రలయ్యాకు దండాలుపెడుతూ నిత్య పూజలు అందించేందుకు భక్తులు సమాయత్తమయ్యారు. విఘ్నాలు తొలగించు వినాయక.. అంటూ మండపాల్లో వెలసిన దేవదేవుడికి విన్నవించే రోజు నేటి నుండి ప్రారంభం కానున్నది. ఏ కార్యం తలపెట్టినా ఆది పూజలు అందేది వినాయకుడికే. ఏ వ్రతం చేపట్టినా గణపతి స్తోత్రంతోనే పూజలు ప్రారంభించడం అనవాయితీ. సోమవారం మండపాల్లో కొలువుదీరనున్న  వినాయకుడి కోసం మండలంలోని అన్ని గ్రామాలలో మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో, ఇతర అలంకరణలతో నిర్వాహకులు సిద్ధం చేసుకున్నారు. మరికొందరు మండపాల నిర్వాహకులు విగ్రహాలను కొనుగోలు చేసి వాహనాల్లో విగ్రహాలను తీసుకెళ్తున్నారు. పండుగ వేళ పూజ సామగ్రి కోసం ప్రజలు రోడ్లపైకి రావడంతో మండల కేంద్రంలోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. సోమవారం నుండి తొమ్మిది రోజులపాటు వినాయకుడు ఘనంగా పూజలు అందుకోనున్నాడు.