ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కలిసిన టియుడబ్ల్యుజె (ఐజెయు) నూతన కార్యవర్గం
నారాయణఖేడ్:తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ-IJU) నారాయణఖేడ్ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం స్థానిక శాసనసభ్యులు (MLA) పట్లోళ్ళ సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యూనియన్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యవర్గ ప్రతినిధులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, జిల్లా కమిటీ సభ్యులు హసీబ్ పటేల్, నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి కే. భూమయ్య, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బి. రాములు, ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. జావిద్, ఉపాధ్యక్షులు బిరాదర్ సంగప్ప, జి. విఠల్, ఎన్. శ్రీనివాస్, మూడ అశోక్ కుమార్, నిసార్, కోశాధికారి నాథేక్, రవీందర్, సంయుక్త కార్యదర్శులు ఎం.ఏ. రషీద్, జైపాల్ రెడ్డి, అంజయ్య, అంబాదాస్, మాణిక్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.