BREAKING
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయం ప్రారంభం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కలిసిన టియుడబ్ల్యుజె (ఐజెయు) నూతన కార్యవర్గం ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్ విడుదల చేయించాలని వినతి మాల కులస్తులకు అన్యాయం చేస్తే ఊరుకోం నారాయణఖేడ్‌లో ‘మజీద్ అమ్మ హాస్పిటల్’ ఘనంగా ప్రారంభం టియుడబ్ల్యుజె (ఐజెయు) మొదటి కార్యవర్గ సమావేశం నాగర్‌కర్నూల్‌లో హత్య కేసు ఛేదన భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి జూనియర్ హాకీ ఆసియా కప్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు మడ అడవుల పరిరక్షణకు శాస్త్రీయ విధానం అవసరం రత్నాలు, ఆభరణాల రంగంలో భారత్ ప్రపంచ కేంద్రం తప్పిపోయిన పెంపుడు కుక్క ఆచూకీ చెబితే రూ.7.8 లక్షల నజరానా.. ప్రకటన జారీ చేసిన యజమానురాలు మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం వినాయక చవితి వేళ నిత్య జీవిత పోరాటం.. పండగ సంబరాల వెనుక చిరు వ్యాపారుల కష్టాలు

మాల కులస్తులకు అన్యాయం చేస్తే ఊరుకోం

Select Suryaa Now
మాల కులస్తులకు అన్యాయం చేస్తే ఊరుకోం

ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్  గోపీనాథ్
జోగిపేట: ఆందోల్ లో మాల కో ఆర్డినేషన్ ఫోరం (MCF) ఆధ్వర్యంలో మాలల రోస్టర్ పాయింట్ ను సవరించాలి అని అన్నారు ప్రముఖ విద్యావేత్త ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ ఎం ఎఫ్ గోపినాథ్. ఆదివారం నాడు ఒక ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆర్యబ్రాహ్మణులు విభజించు పాలించు అనేదే వారి సిద్ధాంతం అని బ్రాహ్మనిజం మరియు క్యాపిటలిజం పూర్తి స్థాయిలో రోస్టర్ పాయింట్ ను అమలు చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని కొందరు మనువాదులు ప్రయత్నం చేస్తున్నారు.

ఏదేమైనా రోస్టర్ పాయింట్ ను సవరించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి హెచ్చరించారు. సుప్రీంకోర్టుకు ఎంపరికల్ డేటా ను పూర్తి స్థాయిలో తప్పుడు నివేదికను  సమర్పించడం జరిగింది. దీనివల్ల తెలంగాణలో ఎస్సీ ఉప వర్గీకరణ లో ప్రభుత్వం మాలలకు తీవ్ర అన్యాయం చేసింది అని మండిపడ్డారు. మాలలకు మాదిగలు శత్రువులు కాదు, మాదిగలకు మాలలు శత్రువులు కాదు అని కొనియాడుతూ పల్నాటివీరుల వారసత్వంలాగా , కన్నమ్మవారి వారసులుగా, కారంచెడు, చుండూరు ఘటనలో మాలల పాత్ర చాలా కీలకమైన పాత్ర పోషించారు.

పాలకపక్షం ఎస్సీల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసింది. ఈ దేశంలో 3% , 5% వున్న వాళ్లు మాత్రమే రాజ్యమేలుతున్నారు.ఈ దేశానికి మూలవాసులమైన మరియు ఉత్పత్తిదారులం కూడా మనమే అని ఉద్ఘాటించారు. దేశంలో 28 మంది మాత్రమే ప్రభుత్వ బ్యాంకుల్లో 28 వేల కోట్లు గుజరాతీలు, మార్వాడీలు దోచుకున్నారు. రాబోయేకాలంలో 12 బ్యాంకులను జాతీయం చేస్తున్నారు. సామాజిక న్యాయమా? లేక మాల సమాజంపై అన్యాయమా? శకుంతల మేడం గారు మాట్లాడుతూ ప్రస్తుత నోటిఫికేషన్ లో వాస్తవ అవకాశాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలకు తీవ్ర అన్యాయం చేశారని ఎద్దేవ చేసారు.

రాజ్యాంగబద్ధమైన పోరాటం శాంతియుతమైన మార్గం, మన ప్రశ్న ఎవరి మీద ద్వేషం కాదు, మన ప్రశ్న ఎవరి హక్కులను లాక్కోవడం కాదని రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సిన వాటా రావాలని దానికోసమే మా పోరాటం అని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం ఎఫ్ గోపినాథ్, శకుంతల, వెంకయ్య, విద్యావేత్త శంకర్ గారు, మాల మహానాడు ఆందోల్ మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దేవయ్య, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనంతయ్య, రాజు , అడ్వకేట్ పుట్ట పద్మారావు, సభా అధ్యక్షులు మొగులయ్య, తలారి దేవరాజ్, బహుజన ప్రసాద్, బేగరి అనిల్, దాసు తదితరులు పాల్గొన్నారు.