BREAKING
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయం ప్రారంభం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కలిసిన టియుడబ్ల్యుజె (ఐజెయు) నూతన కార్యవర్గం ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్ విడుదల చేయించాలని వినతి మాల కులస్తులకు అన్యాయం చేస్తే ఊరుకోం నారాయణఖేడ్‌లో ‘మజీద్ అమ్మ హాస్పిటల్’ ఘనంగా ప్రారంభం టియుడబ్ల్యుజె (ఐజెయు) మొదటి కార్యవర్గ సమావేశం నాగర్‌కర్నూల్‌లో హత్య కేసు ఛేదన భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి జూనియర్ హాకీ ఆసియా కప్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు మడ అడవుల పరిరక్షణకు శాస్త్రీయ విధానం అవసరం రత్నాలు, ఆభరణాల రంగంలో భారత్ ప్రపంచ కేంద్రం తప్పిపోయిన పెంపుడు కుక్క ఆచూకీ చెబితే రూ.7.8 లక్షల నజరానా.. ప్రకటన జారీ చేసిన యజమానురాలు మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం వినాయక చవితి వేళ నిత్య జీవిత పోరాటం.. పండగ సంబరాల వెనుక చిరు వ్యాపారుల కష్టాలు

నారాయణఖేడ్‌లో ‘మజీద్ అమ్మ హాస్పిటల్’ ఘనంగా ప్రారంభం

Select Suryaa Now
నారాయణఖేడ్‌లో ‘మజీద్ అమ్మ హాస్పిటల్’ ఘనంగా ప్రారంభం

నారాయణఖేడ్: పట్టణంలోని ఓల్డ్ SBH బ్యాంక్, పోలీస్ స్టేషన్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన "మజీద్ అమ్మ హాస్పిటల్" ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కమిషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ గైని సాయిలు, రాష్ట్ర కార్యదర్శి గౌస్ చిస్తి, సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి ర్యాకల్ పాల్గొని హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మాజిద్, ప్రముఖ ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సోయబ్ అహ్మద్‌లు విచ్చేసిన అతిథులను శాలువాలతో సన్మానించారు. అనంతరం రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ.. నారాయణఖేడ్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు. అనుభవజ్ఞులైన వైద్యులతో జనరల్ ఫిజిషియన్ సేవలు అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.