BREAKING
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయం ప్రారంభం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కలిసిన టియుడబ్ల్యుజె (ఐజెయు) నూతన కార్యవర్గం ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్ విడుదల చేయించాలని వినతి మాల కులస్తులకు అన్యాయం చేస్తే ఊరుకోం నారాయణఖేడ్‌లో ‘మజీద్ అమ్మ హాస్పిటల్’ ఘనంగా ప్రారంభం టియుడబ్ల్యుజె (ఐజెయు) మొదటి కార్యవర్గ సమావేశం నాగర్‌కర్నూల్‌లో హత్య కేసు ఛేదన భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి జూనియర్ హాకీ ఆసియా కప్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు మడ అడవుల పరిరక్షణకు శాస్త్రీయ విధానం అవసరం రత్నాలు, ఆభరణాల రంగంలో భారత్ ప్రపంచ కేంద్రం తప్పిపోయిన పెంపుడు కుక్క ఆచూకీ చెబితే రూ.7.8 లక్షల నజరానా.. ప్రకటన జారీ చేసిన యజమానురాలు మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం వినాయక చవితి వేళ నిత్య జీవిత పోరాటం.. పండగ సంబరాల వెనుక చిరు వ్యాపారుల కష్టాలు

రత్నాలు, ఆభరణాల రంగంలో భారత్ ప్రపంచ కేంద్రం

Select Suryaa Now
రత్నాలు, ఆభరణాల రంగంలో భారత్ ప్రపంచ కేంద్రం

ముంబై:రాబోయే సంవత్సరాల్లో రత్నాలు, ఆభరణాల రంగానికి భారతదేశం ప్రపంచ కేంద్రంగా ఆవిర్భవించనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో జరిగిన 52వ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ అవార్డ్స్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, ఉపాధి కల్పనలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని, దేశంలో ల్యాబ్-గ్రోన్ డైమండ్ (కృత్రిమ వజ్రాల) మార్కెట్ విస్తరిస్తున్న తరుణంలో ఈ విలువ గొలుసులో పరిశ్రమ ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.

సూరత్, ముంబై నగరాలు ఈ రంగానికి కీలక నమూనాలుగా నిలిచాయని పేర్కొంటూ, ప్రపంచంలో కత్తిరించి, పాలిష్ చేసే ప్రతి పది వజ్రాలలో తొమ్మిది సూరత్‌లోనే ప్రాసెస్ అవుతున్నాయని గుర్తుచేశారు. ఈ పరిశ్రమ 2025 నాటికి ₹2.44 లక్షల కోట్లకు చేరుకుందని, వాణిజ్య ఎగుమతుల్లో 6.3 శాతం వాటాతో 75 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. ఇండియా జ్యువెలరీ పార్క్, SEEPZలో మెగా కామన్ ఫెసిలిటీ సెంటర్ వంటి ప్రాజెక్టులు, వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTA) రత్నాలు-ఆభరణాల రంగానికి సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతున్నాయని అమిత్ షా వివరించారు.