BREAKING
వ్యర్థ ఉష్ణాన్ని విద్యుత్తుగా మార్చే కొత్త ఆవిష్కరణ 1033 హెల్ప్‌లైన్‌ను అప్‌గ్రేడ్ చేయనున్న ఎన్‌హెచ్‌ఏఐ వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు దంపతుల అనుమానాస్పద మృతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు పీజీ సీటు రాలేదనే మనోవేదనతో వైద్యుడి మృతి ఢిల్లీలో ఎన్టీఏ కొత్త చిరునామా ఇదే.. కీలక వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జనరల్ సింగరేణిలో వేధింపుల ఆరోపణలు.. అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి.. వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు శ్రీ వర సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు డిఎఫ్ఎస్ (DFS)కు ‘రాజ్‌భాషా కీర్తి పురస్కారం’ పోఖ్రాన్‌లో ఐఏఎఫ్ ‘డ్రోనథాన్-2026’ ప్రారంభం భారత్-మెర్కోసూర్ వాణిజ్య ఒప్పందం విస్తరణ ప్రపంచ స్థాయికి ఆయుర్వేదం

ఇనుమడించిన దేశ ఖ్యాతి

Select Suryaa Now
ఇనుమడించిన దేశ ఖ్యాతి

న్యూఢిల్లీ: బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు దౌత్యపరంగా బిజీబిజీగా గడిపారు. సెప్టెంబర్‌ 11 నుంచి 13 వరకు 15 అధికారిక ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రపంచ దేశాధినేతలతో భేటీ అయ్యారు. వీటికి అదనంగా పలువురు నేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో అనధికారిక ‘పుల్‌-అసైడ్‌’ చర్చలు కూడా నిర్వహించారు.

మొదటి రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో మోదీ భేటీ అయ్యారు. పుతిన్‌తో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు.

రెండో రోజు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు దేశాల సంబంధాలను మరింత స్థిరీకరించడం, ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరిగాయి. ఇదే రోజున ఇథియోపియా, మలేసియా, అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌, వియత్నాం నేతలతోనూ మోదీ సమావేశమయ్యారు.

మూడో రోజు కజకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, ఈజిప్ట్‌, దక్షిణాఫ్రికా, బురుండి, నైజీరియా, ఉగాండా నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్‌ ఎల్‌-సీసీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

ఈ భేటీల్లో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, సాంకేతికత, కీలక ఖనిజాలు, ప్రాంతీయ భద్రత, గ్లోబల్‌ సౌత్‌ ప్రయోజనాలు, బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఐరాస ప్రధాన కార్యదర్శితో సమావేశంలో ఐరాస భద్రతామండలి సహా బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణల అవసరాన్ని మోదీ ప్రస్తావించారు.

ఇలా బ్రిక్స్‌ సదస్సును కేవలం బహుపాక్షిక వేదికగా కాకుండా.. భారత్‌ వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశంగా కూడా మోదీ ప్రభుత్వం వినియోగించింది. మూడు రోజుల్లో 15 భేటీలతో భారత్‌ దౌత్య ప్రాధాన్యతను ప్రపంచ వేదికపై చాటినట్లయింది.