BREAKING
వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు దంపతుల అనుమానాస్పద మృతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు పీజీ సీటు రాలేదనే మనోవేదనతో వైద్యుడి మృతి ఢిల్లీలో ఎన్టీఏ కొత్త చిరునామా ఇదే.. కీలక వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జనరల్ సింగరేణిలో వేధింపుల ఆరోపణలు.. అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి.. వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు శ్రీ వర సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు డిఎఫ్ఎస్ (DFS)కు ‘రాజ్‌భాషా కీర్తి పురస్కారం’ పోఖ్రాన్‌లో ఐఏఎఫ్ ‘డ్రోనథాన్-2026’ ప్రారంభం భారత్-మెర్కోసూర్ వాణిజ్య ఒప్పందం విస్తరణ ప్రపంచ స్థాయికి ఆయుర్వేదం భూటాన్‌లో భారత సీఈసీ పర్యటన హైటెక్ సిటీలో దంచికొట్టిన వర్షం: నీట మునిగిన రోడ్లు.. మూసివేసిన అధికారులు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Select Suryaa Now
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 14): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వినాయకునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు కలగాలని కోరారు. వినాయక చవితి వేడుకలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలు పరస్పర సమన్వయంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా,  వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, వికారాబాద్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్, ఆర్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.