BREAKING
తిరుమలలో ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ: రేపు ధ్వజారోహణం బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో 3 రోుజులే గడువు! రేపు తిరుమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ యాంకీ గ్రామంలో వ్యక్తి దారుణ హత్య ఢిల్లీలో 'సేవా సంకల్ప అభియాన్' రణ్‌బీర్ కపూర్ రామాయణం పోస్టర్ గ్లింప్స్ విడుదల.. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీగా బందెల సత్యనారాయణ మట్టి గణపతి పర్యావరణానికి రక్ష: ఉప్పల్ ఎమ్మెల్యే లండన్ వేదికగా మెరిసిన సీఎం విజయ్: తమిళనాడుకు రూ. 11,000 కోట్ల భారీ పెట్టుబడులు మసూద్‌ అజర్‌పై పాక్‌ రివార్డు పెంపు: అంతర్జాతీయ నిఘాకు కన్నుగప్పే సరికొత్త డ్రామా? PSGకి ఈ సీజన్‌లో తొలి విజయం ఆర్చరీ ప్రపంచ కప్‌ గెలిచిన ధీరజ్ యూఎస్ ఓపెన్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్ బేగంబజార్‌లో 48 కిలోల బంగారు గణేశుడు.. 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్‌తో ప్రత్యేక అలంకరణ భారత్ ఖాతాలో ఎనిమిదో ఆసియా కప్

యాంకీ గ్రామంలో వ్యక్తి దారుణ హత్య

Select Suryaa Now
యాంకీ గ్రామంలో వ్యక్తి దారుణ హత్య

గొంతు కోసి వడ్డే బుజ్జప్ప హతం.. గ్రామంలో కలకలం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ చంద్రశేఖర్‌రెడ్డి

దౌల్తాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 14): దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకీ గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన వడ్డే బుజ్జప్ప (48)ను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

బుజ్జప్పపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కొడంగల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు బుజ్జప్ప యాంకీ గ్రామంలోనే నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా, వారు హైదరాబాద్‌లో చదువుకుంటున్నట్లు సమాచారం. భార్య కూడా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.