BREAKING
మట్టి గణపయ్యకు తొలి పూజ చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బి ఎస్ ఆర్ ) సంగారెడ్డి జిల్లాలో 14 మి.మీ. సగటు వర్షపాతం ఆర్‌.సీ.పురంలో అత్యధికంగా 55.8 మి.మీ. వర్షం.. జిన్నారంలో 47.8 మి.మీ. గణపతికి సీఎం పూజలు ప్రజాసేవే దామోదర్ రెడ్డి ఆశయం, మానవతా సేవే దామన్నకు నిజమైన నివాళి:- చెవిటి వెంకన్న యాదవ్ రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో ప్రత్యేక అలంకరణ నవరాత్రుల తొలిరోజు హరిద్రవర్ణం అలంకరణలో స్వామివారి దర్శనం. అష్ట స్వయంవ్యక్త క్షేత్రం శ్రీమూష్నం.. సర్వరోగాలు నయం చేసే నిత్య పుష్కరిణి, మత సామరస్య విశేషాలు ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన ఇంద్రకీలాద్రిపై కొలువైన అపరాజితా దేవి విశిష్టత.. సర్వకార్య విజయాలను ప్రసాదించే చండీ సప్తశతి స్తోత్రం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు రామగిరి లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి కలెక్టరేట్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు

మట్టి గణపయ్యకు తొలి పూజ చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బి ఎస్ ఆర్ )

Select Suryaa Now
మట్టి గణపయ్యకు తొలి పూజ చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బి ఎస్ ఆర్ )

 

బిఎస్ఆర్ దంపతుల ఆధ్వర్యంలో జక్కేపల్లి ఆర్బిఓఎల్ సంస్థల్లో వినాయక చవితి వేడుకలు

విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి.. బీఎస్ఆర్

యాలాల, సెప్టెంబర్ 14: యాలాల మండలంలోని జక్కేపల్లి ఆర్బిఓఎల్ సంస్థల్లో వినాయక చవితి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంస్థ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతి విగ్రహానికి సంస్థ అధినేత బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (బిఎస్ఆర్), సరళారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా గణనాథుడికి పుష్పాలతో అందంగా అలంకరించి, పసుపు, కుంకుమ, పుష్పాలు, పత్రాలతో పూజలు చేశారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి, మంగళహారతి నిర్వహించారు. ‘విఘ్నేశ్వరా.. విఘ్నాలు తొలగించి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి’ అంటూ గణపయ్యను భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి నిరంతరం కొనసాగాలని,ప్రజలందరికీ సుఖసంతోషాలు,ఐశ్వర్యం కలగాలని బిఎస్ఆర్ దంపతులు గణనాథుడిని ప్రార్థించారు. మట్టి గణపతిని ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు.
వినాయక చవితి వేడుకల్లో ఆర్బిఓఎల్ సంస్థల సిబ్బంది,మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొని ‘గణపతి బప్పా మోరియా’అంటూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.పూజా కార్యక్రమాలతో సంస్థ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగింది.