కలెక్టరేట్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ప్రత్యేక పూజలు నిర్వహించిన అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 14): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వినాయకుడికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. జిల్లా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు.వినాయక చవితి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ సీసీతో పాటు కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.