విఘ్నేశ్వరుని తొలి పూజలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
తాండూరు, మేజర్ న్యూస్ : శ్రీ భద్రేశ్వర వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విఘ్నేశ్వరుని తొలి పూజా కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరై శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజల జీవితాల్లోని సర్వ విఘ్నాలు తొలగి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.
ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రచార కోఆర్డినేటర్ కర్ణం పురుషోత్తం రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, తాండూర్ పట్టణ మాజీ అధ్యక్షుడు అగ్గనూర్ జగదీశ్వర్, నాయకులు తంబాకు శేఖర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి బిర్కడ్ రఘు, మున్సిపల్ కౌన్సిలర్ యోగనంద్, యువ నాయకులు రుద్రూ పాటిల్, సంతోష్ గౌడ్, కరుణాకర్ పాటిల్, హరి గౌడ్, భగవాన్, అరవింద్ రెడ్డి, శివానంద్ మడపతి, ఎర్రం శ్రీధర్, సోము అయ్యా, కల్వ వంశీ, పరమేష్, బబ్లు, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.